2013, ఏప్రిల్ 23...రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్. విండీస్ వీరుడు క్రిస్‌గేల్ తన ప్రతాపం చూపించాడు. ఎంతలా అంటే ఐపీఎల్లో రికార్డులు చెరిగిపోయాలా. ఈ మ్యాచ్‌లో గేల్ 30 బంతుల్లో శతకం (11 సిక్సర్లు, 8 ఫోర్లు) బాది...ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు 2010లో ఉన్న యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో శతకం రికార్డును బద్ధలు కొట్టాడు.
మ్యాచ్‌లో 66 బంతుల్లో 175 పరుగులతో పూణె బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ హిట్టర్...ఆర్సీబీ ఆటగాడు మెక్కల్లమ్ పేరిట ఉన్న158 పరుగులఅత్యధిక వ్యక్తిగత స్కోరు ను వెనక్కినెట్టాడు.