చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని సేన 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రంలోనే.. డెత్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు స్కాట్ కగ్లిజన్.
తొలి 2 ఓవర్లలో 27 పరుగులిచ్చిన ఈ కివీస్ ఆటగాడు.. చివరి రెండు ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు ( సర్ఫ్రాజ్ ఖాన్, కేఎల్ రాహుల్)తీశాడు.
"18 బంతుల్లో 46 పరుగులు చేయాల్సిన సమయంలో కగ్లిజన్కు బౌలింగ్ అప్పగించడం ఓ సాహసం. బ్రావో గాయంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చి తొలిసారి ఐపీఎల్లో ఆడాడు. 3 రోజులు మాత్రమే జట్టుతో ఉన్న ఈ ఆటగాడికి కీలక ఓవర్లలో బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. డెత్ ఓవర్లలో అదరగొట్టాడు" అని ప్రశంసలు కురిపించాడు ఫ్లెమింగ్.
అనుభవజ్ఞులైన హర్భజన్, తాహిర్‌ల బౌలింగ్ కోటా పూర్తికాగా..చివరి 3 ఓవర్లలో తీవ్ర ఒత్తిడిలోనూ కగ్లిజన్, దీపక్ చాహర్‌లు అద్భుతంగా రాణించారు.
తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 9న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది చెన్నై సూపర్‌కింగ్స్.