ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్‌లో చోటు కోసం పట్టుదలగా ఉంది కోల్‌కతా నైట్ రైడర్స్. 16 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్న ముంబయి టాప్-2లో చేరేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండింటి మధ్య వాంఖడే వేదికగా నేడు రసవత్తర పోరు జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
క్రిస్ లిన్, శుభ్‌మన్ గిల్, ఆండ్రీ రసెల్ నిలకడగా ఆడుతూ జట్టుకు అద్భుత విజయాలు అందిస్తున్నారు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఆకట్టుకోవాల్సి ఉంది. వాంఖడేలో ఆడిన అనుభవం కార్తీక్‌కు ఉంది. అక్కడ సత్తా చాటాలని కోల్‌కతా అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ సీజన్లో ఎక్కువగా రసెల్‌పైనే ఆధారపడిన కోల్‌కతా సమష్టిగా రాణించాల్సి ఉంది. బౌలింగ్ విభాగం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోతుంది. స్లో బౌలర్లకు వాంఖడే అనుకూలించే అవకాశముంది.
గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సూపర్ ఓవర్లో గెలిచిన ముంబయి ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ పక్కా చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి టాప్-2లోకి వెళ్లాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎక్కువ రన్‌రేట్‌తో గెలిస్తే ముంబయి అగ్రస్థానానికి వెళ్లే అవకాశం కూడా ఉంది.