తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోని క్రీజులో ఉంటే ఒత్తిడి ప్రత్యర్థికే'

చెన్నై కెప్టెన్ ధోనిపై ప్రశంసలు కురిపించాడు సహచర బ్యాట్స్​మన్ రైనా. అతడు బ్యాటింగ్ చేస్తుంటే ప్రత్యర్థులు ఒత్తిడికి లోనవుతారని చెప్పాడు. స్టంపింగ్స్​లోనూ అద్భుతాలు చేస్తున్నాడని కొనియాడాడు.

'ధోని క్రీజులో ఉంటే ఒత్తిడి ప్రత్యర్థికే'

By

Published : May 2, 2019, 3:09 PM IST

"ఆ బ్యాట్స్​మన్ మైదానంలో ఉంటే ఒత్తిడికి గురవ్వడు. ప్రత్యర్థిని ఒత్తిడికి లోనయ్యేలా చేస్తాడు".... ఈ మాటలన్నది చెన్నై బ్యాట్స్​మన్ సురేశ్ రైనా. చెప్పింది కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి.

బుధవారం దిల్లీతో మ్యాచ్​లో 80 పరుగుల తేడాతో గెలిచింది సీఎస్​కే. అనంతరం మాట్లాడిన రైనా.. ధోని గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

"ధోని కెప్టెన్​గా మ్యాచ్​లో లేకపోతే సమస్య కాదు. బ్యాట్స్​మన్​గా లేకపోవడం మాత్రం పెద్ద లోటు. ఇటీవల హైదరాబాద్​, ముంబయితో మ్యాచ్​ల్లో అదే జరిగింది. అతడు క్రీజులోకి వస్తే ప్రత్యర్థికే ఒత్తిడంతా. ధోని లేనప్పుడు ఈ విషయం మాకు అర్ధమైంది. గత కొన్నేళ్లుగా బ్యాట్స్​మన్​గా, మార్గనిర్దేశకుడిగా రాణిస్తున్నాడు. ధోని మరింత కాలం క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా" -సురేశ్ రైనా, చెన్నై సూపర్ కింగ్స్

బుధవారం దిల్లీతో మ్యాచ్​లో ఒకే ఓవర్​లో రెండు అద్భుతమైన స్టంపింగ్స్​ చేసి ఆకట్టుకున్నాడు ధోని. బ్యాట్స్​మన్​గానే కాకుండా కీపర్​గానూ మహీ రాణిస్తున్నాడని ప్రశంసలు కురిపించాడు రైనా. ఈ మ్యాచ్​లో చివరి వరకు క్రీజులో నిలిచిన ధోని.. 22 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టు 179 స్కోరు చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. రైనా 59 పరుగులు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details