తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ధోనీ - ఐపీఎల్​

చెపాక్​ స్టేడియంలో ముంబయి ఇండియన్స్​తో జరుగుతున్న క్వాలిఫయర్​-1 మ్యాచ్​లో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది చెన్నై సూపర్​కింగ్స్​.

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ధోనీ

By

Published : May 7, 2019, 7:29 PM IST

ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ - చెన్నై సూపర్​కింగ్స్​ మధ్య తొలి క్వాలిఫయర్​ మ్యాచ్​కు చెన్నైలోని చెపాక్​ స్టేడియం వేదికైంది. టాస్​ గెలిచిన ధోనీ బ్యాటింగ్​ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు సరాసరి ఫైనల్​కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుకు ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం ఉంది. ఓడిన జట్టు.. దిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య బుధవారం విశాఖపట్టణంలో జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్​ విజేతతో తలపడుతుంది.

ఈ స్టేడియంలో 7 మ్యాచుల్లో ఇరుజట్లు తలపడగా... ముంబాయి 5, చెన్నై2 విజయాలు సాధించాయి. ఈ సీజన్‌లో చెన్నైని సొంతగడ్డపై ఓడించిన ఏకైక జట్టు ముంబయే.

  1. చెన్నై ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. ధ్రువ్‌ షోరే బదులుగా మురళి విజయ్​కు స్థానం లభించింది.
  2. ముంబయి ఒక్క మార్పుతోనే పోటీకి దిగుతోంది. మెక్లెనగన్‌ స్థానం కోల్పోగా జయంత్​ యాదవ్​ చోటు దక్కించుకున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్:

ధోని (సారిథి), వాట్సన్‌, డుప్లెసిస్‌, రైనా, మురళి విజయ్​, అంబటి రాయుడు, జడేజా, బ్రావో, దీపక్‌ చాహర్‌, హర్భజన్‌, తాహిర్‌

ముంబయి ఇండియన్స్:

రోహిత్‌ శర్మ (సారథి), డికాక్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, , రాహుల్‌ చాహర్‌, మలింగ, బుమ్రా, జయంత్​ యాదవ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details