జూనియర్ పరాశక్తిని గెలిపించిన ధోని - ఐపీఎల్
ఎప్పుడూ చిరునవ్వుతో చలాకీగా ఉండే ధోని చిన్నపిల్లలతో సరదాగా ఆడుకున్నాడు. పరుగెత్తండి అంటూ చిన్నారులను ప్రోత్సహిస్తూనే.. ఓడిపోతున్న తాహిర్ కొడుకును గెలిపించాడు.
జూనియర్ పరాశక్తిని గెలిపించిన ధోనీ
చెన్నై సూపర్‌కింగ్స్, పంజాబ్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ధోని సేన గెలుపొందింది. అయితే మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన తాహిర్ (పరాశక్తి ఎక్స్‌ప్రెస్) 2 కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ అనంతరం జూనియర్ పరాశక్తి (తాహిర్ కొడుకు), జూనియర్ వాటో (వాట్సన్ కొడుకు) మధ్య పరుగు పందెం పెట్టారు. అయితే ఈ పోటీలో వెనుకంజలో ఉన్న తాహిర్ కొడుకును ఎత్తుకుని పరుగెత్తుకొచ్చేశాడు ధోని. అనంతరం మళ్లీ ఇలాగే వెళదాం అంటూ జూనియర్ పరాశక్తి అనటం నవ్వులు పూయించింది.