తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నై హ్యాట్రిక్​ విజయానికి ఓ బంతి​ సాయం - చెన్నై సూపర్​ కింగ్స్

క్రికెట్​లో బౌలర్​ విసిరిన బంతి వికెట్లకు తాకితే ఎవరైనా ఔట్ అవుతారు ఒకవేళ నోబాల్ అయితే తప్ప. కాని ధోని ఆడిన బంతి సరైనదే ​అయినా నాటౌట్​గా మ్యాచ్​ కొనసాగించాడు. ఎలా..?

చెన్నై హ్యాట్రిక్​ విజయానికి ఓ బంతి​ సహాయం

By

Published : Apr 1, 2019, 3:29 PM IST

రాజస్థాన్​ రాయల్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్​లో ధోని చెలరేగిపోయాడు. ఫలితంగా చెన్నై హ్యాట్రిక్​ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్​లో ధోని డకౌట్​ అయ్యేవాడే. కానీ బంతి వికెట్లకు తగిలినా నాటౌట్​గా బయటపడటం ఆశ్చర్యకరం.

  • 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో ఉంది. ఆ సమయంలోక్రీజులోకి వచ్చిన ధోని.. జోఫ్రా ఆర్చర్​ వేసిన 5వ ఓవర్​ నాలుగో బంతి డిఫెన్స్​​ ఆడాడు. కాని ధోని బ్యాట్​కు తగిలిన బంతి​ నెమ్మదిగా వెళ్లి వికెట్స్​కు తాకింది అయితే బెయిల్స్ కింద పడకపోవడంతో... మహీ బతికిపోయాడు.

ఆ విచిత్రమైన సంఘటనకు "ధోని ఎఫెక్ట్​ చూడండి. బంతి తగిలినా బెయిల్స్ పడలేదు" అంటూ ఐపీఎల్​ వీడియోను షేర్​ చేసింది.

ABOUT THE AUTHOR

...view details