తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో ధోని అరుదైన ఘనతలు - చెన్నైసూపర్ కింగ్స్

ఆదివారం బెంగళూరుతో మ్యాచ్​లో ధోని పలు రికార్డులు సాధించాడు. ఐపీఎల్​లో 200 సిక్స్​లు కొట్టిన తొలి భారత క్రికెటర్​గా నిలిచాడు. కెప్టెన్​గా 4000 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు.

ఐపీఎల్​లో ధోని రికార్డులే రికార్డులు

By

Published : Apr 22, 2019, 9:45 AM IST

మహేంద్ర సింగ్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్​కు సారథిగా పలు విజయాలు తెచ్చిపెడుతున్నాడు. వ్యక్తిగతంగానూ పలు రికార్డులు నమోదు చేస్తున్నాడు. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ఒంటి చేత్తో చెన్నైను గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఒక్క పరుగు తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది.

ఈ క్రమంలో 84 పరుగులతో నాటౌట్​గా నిలిచిన ధోని.. ఐపీఎల్​లో తన పేరిట అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 200 సిక్స్​లు కొట్టిన తొలి భారత క్రికెటర్​గా నిలిచాడు. ఈ టోర్నీలో కెప్టెన్​గా 4000 పరుగుల్ని పూర్తి చేసుకున్న ఘనత సాధించాడు.

ఇది చదవండి: ఐపీఎల్​లో రికార్డు నెలకొల్పిన బెయిర్​స్టో

ABOUT THE AUTHOR

...view details