తెలంగాణ

telangana

ETV Bharat / sports

'క్లారిటీ కోసమే గీత దాటిన మిస్టర్​ కూల్' - ధోనీ, అంపైర్ల గొడవ

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ధోనీ కోపాన్ని ప్రదర్శించాడు. తన కెరీర్​లో తొలిసారి ఔటైన తర్వాత మళ్లీ గ్రౌండ్​లోకి అడుగుపెట్టాడు. అంపైర్​ ఉల్హాస్​ గాందే నోబాల్​ను ప్రకటించకపోవడం వల్ల అసహనానికి గురైన ధోనీ... గీత దాటి క్రికెట్​ నిబంధనలు ఉల్లంఘించి గ్రౌండ్​లోకి వెళ్లాడు.

'క్లారిటీ కోసమే గీత దాటిన మిస్టర్​ కూల్'

By

Published : Apr 12, 2019, 8:13 AM IST

Updated : Apr 12, 2019, 9:25 AM IST

చెన్నై, రాజస్థాన్​ రాయల్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ఆఖరి ఓవర్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజయానికి మూడు బంతుల్లో 8 పరుగులు కావాల్సిన సమయంలో ధోనీ ఔటయ్యాడు.

  1. చివరికి రెండు బంతుల్లో 6 రన్స్​ కావాల్సిన సమయంలో స్టోక్స్ వేసిన నాలుగో బంతికి బౌలర్​ సాంట్నెర్ రెండు పరుగులు తీశాడు. కానీ మొదటి పరుగు అందుకునే క్రమంలో అంపైర్ నో బాల్ సిగ్నల్ ఇచ్చాడు. బంతి ఎక్కువ ఎత్తులో వచ్చిందనే ఉద్దేశంతో మొదట సిగ్నల్ ఇచ్చినా తర్వాత ఫీల్డ్​ అంపైర్​తో సంప్రదించాక వెనక్కి తీసుకున్నాడు. ఇది టీవీ రీప్లేలో స్పష్టంగా కనబడటం వల్ల... తొలుత డగౌట్​ నుంచే నోబాల్​ అంటూ అరిచిన ధోనీ... వెంటనే మైదానంలోకి వెళ్లాడు.
  2. అనంతరం అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. సర్ది చెప్పిన అనంతరం వెళ్తూ వెళ్తూ లెగ్​ అంపైర్​ గఫానే పట్ల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇలా ఔటైన వ్యక్తి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడం కిక్రెట్​ నిబంధనలు ఉల్లంఘించడమే. దీనిపై ఐపీఎల్​, బీసీసీఐ ధోనీ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

మ్యాచ్​ అనంతరం జరిగే అవార్డుల కార్యక్రమంలో స్టార్​ స్పోర్ట్స్​ వ్యాఖ్యాత కార్తీక్​ దీనిపై ప్రశ్నించాల్సి ఉన్నా ధోనీని అడగలేకపోయాడు.

  • 'ఆటను మళ్లీ ఎక్కడికి తీసుకెళ్దామనుకున్నావ్​..? అని వ్యాఖ్యాత కార్తీక్​ అడిగిన ప్రశ్నకు... నేను చివరి వరకు అక్కడ ఉంటే అంపైర్లతో ఆ సంభాషణ జరిగేదా అంటూ ధోనీ సమాధానమిచ్చాడు. ఈ సమాధానం తర్వాత వేరే ప్రశ్న సంధించకుండానే పంపించడం పట్ల కార్తీక్​ వీక్షకులు, నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

మ్యాచ్​ అనంతరం ధోనీ ప్రవర్తనపై కోచ్ ఫ్లెమింగ్​​ స్పందించాడు.

మొదట అంపైర్​ నోబాల్​ ఇచ్చేందుకు సిగ్నల్​ ఇచ్చారు. తర్వాత విరమించుకోవడం వల్ల అది నోబాల్ అవునా కాదా అన్న సందిగ్ధంపై వివరణ అడిగేందుకే ధోనీ గ్రౌండ్​లోకి వెళ్లాల్సి వచ్చింది.
- చెన్నై సూపర్​కింగ్స్​ కోచ్​, ఫ్లెమింగ్​

Last Updated : Apr 12, 2019, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details