తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ ఫైనల్​​ చేరడానికి కారణం వీళ్లే: ధోని - ఐపీఎల్

చెన్నై సూపర్​ కింగ్స్ ఫైనల్​ చేరడానికి జట్టులోని బౌలర్ల కీలక ప్రదర్శనే కారణమని కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోని ప్రశంసించాడు. మే 12న జరిగే ఫైనల్​లో ముంబయితో తలపడనుంది సీఎస్​కే.

ఈ విజయానికి కారణం వీళ్లే: ధోని

By

Published : May 11, 2019, 12:46 PM IST

డిఫెండింగ్ ఛాంపియన్​ చెన్నై సూపర్​ కింగ్స్​ ఎనిమిదో సారి ఐపీఎల్​ ఫైనల్​లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్​-2లో దిల్లీపై 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది చెన్నై. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన ధోని.. ఈ సీజన్​లో చెన్నై ప్రదర్శనకు, ఫైనల్ చేరేందుకు కారణం జట్టులోని బౌలర్లే అంటూ ప్రశంసించాడు.

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లకు 147 పరుగులే చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టులో డుప్లెసిస్‌, వాట్సన్ అర్ధ సెంచరీలతో చెలరేగడం వల్ల అలవోకగా విజయం సాధించింది.

‘మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టడమే కీలకం. కాబట్టి ఈ ఘనత బౌలర్లకు ఇవ్వాల్సిందే. తనకు ఏం కావాలో కెప్టెన్‌ అడుగుతాడు. వారు ఎలా బౌలింగ్‌ చేయాలి, వికెట్లు ఎలా తీయాలి అన్నది నిర్ణయించుకుంటారు. ఈ సీజన్‌లో మేం ఇక్కడ ఉన్నామంటే అందుకు బౌలర్లే కారణం. మా బౌలింగ్‌ బృందానికి కృతజ్ఞతలు’ -ధోని, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్

బౌలర్ దీపక్ చాహర్​తో కెప్టెన్ ధోని

మే 12న హైదరాబాద్​ వేదికగా జరిగే ఫైనల్​ పోరులో ముంబయి ఇండియన్స్​తో తలపడనుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇరుజట్లలోని ఏ టీమ్ విజయం సాధించినా నాలుగోసారి ఐపీఎల్​ కప్పును అందుకుంటుంది.

ABOUT THE AUTHOR

...view details