తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ రహస్యం రిటైరయ్యాక చెప్తా : ధోనీ - చెన్నై సూపర్​ కింగ్స్

ఐపీఎల్​ 12వ సీజన్​లో ప్లేఆఫ్​ చేరిన తొలి జట్టు చెన్నై సూపర్​కింగ్స్​. అయితే జట్టు ప్రతిసారి ప్లేఆఫ్​​ దాటడంపై ఓ రహస్యముందని వెల్లడించాడు సారథి ధోనీ.

ఆ నిజం రిటైరయ్యాక చెప్తా : ధోనీ

By

Published : Apr 24, 2019, 12:42 PM IST

చెన్నై సూపర్​ కింగ్స్​ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఐపీఎల్‌లో ఇంతగా రాణించడం వెనుక రహస్యం ఏంటన్న ప్రశ్నపై ధోనీ స్పందిస్తూ...'ఒకవేళ అందరికీ నేను ఆ రహస్యాన్ని చెప్తే.. వచ్చే ఐపీఎల్‌ వేలంలో చెన్నై యాజమాన్యం నన్ను కొనుగోలు చేయదు. అది వ్యాపార రహస్యం' అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.

అభిమానుల మద్దతు, యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహమే మా సక్సెస్​ మంత్రం అంటూ మాట్లాడాడు. సహాయక బృందం తోడ్పాటుపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఇంతకు మించి నేను ఎక్కువగా చెప్పలేను. రిటైర్‌ అయ్యాక ఏమైనా ఉంటే చెప్తా అని అన్నాడు. రాబోతున్న ప్రపంచకప్ పైనే దృష్టి పెడుతున్నట్లు వెల్లడించాడు మిస్టర్​ కూల్​.

ఈ సీజన్​లో 11 మ్యాచ్​లు ఆడిన ధోనీసేన 8 విజయాలు సాధించి ...16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 10 మ్యాచుల్లో ఆడిన ధోనీ...314 పరుగులతో మూడో అత్యధిక రన్స్​ చేసిన వ్యక్తిగా కొనసాగుతున్నాడు. సీఎస్​కే జట్టుకు 155 మ్యాచుల్లో సారథ్యం వహించిన ధోనీ...97 విజయాలు, 57 ఓటములు ఖాతాలో వేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details