కోల్కతాతోశుక్రవారంజరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో దిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ 97 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీనిపై స్పందించాడు దిల్లీ జట్టు సలహాదారు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ. ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లలో ధావన్ ఒకడని ప్రశంసించాడు.
అత్యుత్తమ ఓపెనర్లలో శిఖర్ ఒకడు. ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్లో ఫామ్‌లోకి వచ్చాడు. ఇది జట్టుకి శుభపరిణామం. క్రీజులో కుదురుకుంటే ధావన్‌ను అడ్డుకోవడం కష్టం. భారత్ తరఫున ఎలా ఆడతాడో ఇక్కడా అలానే ఆడుతున్నాడు. -గంగూలీ, దిల్లీ క్యాపిటల్స్ సలహాదారు
ఈ మ్యాచ్‌లో శతకం చేసే అవకాశాన్ని కోల్పోయాడు ధావన్. 19వ ఓవర్ చివరి బంతికి సిక్స్ కొట్టిన ఇంగ్రామ్ దిల్లీని విజేతగా నిలిపాడు. దీంతో ధావన్ 97 పరుగులతో నాటౌట్ నిలిచాడు.
రానున్న ప్రపంచకప్‌లో ధావన్ రాణిస్తాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2107 ఇంగ్లండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అతడి ప్రదర్శనే దీనికి ఉదాహరణ అని చెప్పాడు.
దిల్లీ జట్టులోని పృథ్వీషా, పంత్, శ్రేయస్ అయ్యర్లపైనా ప్రశంసలు కురిపించాడీ మాజీ టీమిండియా సారథి. క్యాపిటల్స్‌లోని బ్యాట్స్‌మెన్, బౌలర్లు సమష్టిగా రాణిస్తున్నారని అన్నాడు.