ఫిరోజ్‌షా కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో దిల్లీ గెలిచింది. నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించలేక 170 కే పరిమితమైంది. క్యాపిటల్స్ జట్టులో శ్రేయస్, ధావన్.. అర్ధశతకాలతో రాణించారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిల్లీ అగ్రస్థానానికి చేరుకుని ఫ్లేఆఫ్‌కు అర్హత సాధించింది. 2012 తర్వాత దిల్లీ.. ఫ్లేఆఫ్స్‌కు చేరింది ఇప్పుడే.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది దిల్లీ క్యాపిటల్స్. ఓపెనర్లిద్దరూ తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించారు. అనంతరం 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పృథ్వీషా ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. మరో ఓపెనర్ ధావన్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ క్రమంలోనే వీరిద్దరూ అర్ధ సెంచరీలు చేశారు. రెండో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ధావన్ 50, అయ్యర్ 52 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. చివర్లో వచ్చిన రూథర్‌ఫర్డ్ 28, అక్షర్ పటేల్ 16 ధాటిగా ఆడి జట్టు స్కోరు 187 పరుగులు చేయడంలో సహాయపడ్డారు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో పంత్ 7, ఇంగ్రామ్ 11 రన్స్ చేశారు.