తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే గెలవాల్సిందే' - దిల్లీ క్యాపిటల్స్

దిల్లీ వేదికగా నేడు దిల్లీ క్యాపిటల్స్​తో, రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. దిల్లీ ఇప్పటికే ప్లేఆఫ్స్​కి చేరగా.. రాజస్థాన్ గెలుపుకోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి. సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్ జరుగనుంది.

'ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే గెలవాల్సిందే'

By

Published : May 4, 2019, 7:01 AM IST

ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్​కు చేరిపోయాయి. మరో స్థానం కోసం రాజస్థాన్, హైదరాబాద్, కోల్​కతా, పంజాబ్ పోటీపడుతున్నాయి. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్ నేడు దిల్లీ క్యాపిటల్స్​తో తలపడనుంది. దిల్లీ వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్ జరుగనుంది.

దిల్లీ ప్రధాన పేసర్ రబాడ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్​లకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా చెన్నైతో జరిగిన మ్యాచ్​లో ఆడలేదీ దక్షిణాఫ్రికా పేసర్. ఏడేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించిన దిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని నిలబెట్టుకోవడంపై కన్నేసింది.

ఈ మ్యాచ్​లో గెలిచి ప్లేఆఫ్స్​కు విజయోత్సాహంతో వెళ్లాలని భావిస్తోంది దిల్లీ. గత మ్యాచ్​లో చెన్నై చేతిలో 80 పరుగుల తేడాతో ఓడిన శ్రేయస్ సేనకు ఈ విజయం భరోసా కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

రబాడ గైర్జాజరైనప్పటికీ క్రిస్ మోరిస్, బౌల్ట్, రూథర్​ఫోర్డ్​, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రాలతో బౌలింగ్ విభాగం బలంగానే కనిపిస్తుంది. గత మ్యాచ్​లో విఫలమైన బ్యాట్స్​మెన్ తిరిగి రాణించాలని జట్టు భావిస్తోంది. చెన్నైపై శ్రేయస్ 44 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్​మెన్ దారుణంగా విఫలమయ్యారు.

ఆడిన 13 మ్యాచ్​ల్లో 11 పాయింట్లతో ఉంది రాజస్థాన్ రాయల్స్. సాంకేతికంగా చూస్తే ఈ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఈ మ్యాచ్​లో విజయం సాధించి మిగిలిన జట్ల ఓటములపై ఆధారపడి టోర్నీలో ముందడుగు వేసే అవకాశం ఉంది.

ప్రపంచకప్ దృష్ట్యా స్వదేశానికి పయనమైన స్టీవ్ స్మిత్ స్థానంలో రహానే తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. స్మిత్, బట్లర్, బెన్​స్టోక్స్ జట్టుకు దూరమవగా.. బ్యాటింగ్​లో రహానే, సంజు శాంసన్, లివింగ్​స్టోన్​లపై ఎక్కువ భారం పడనుంది. బౌలింగ్​లో శ్రేయస్ గోపాల్​ అద్భుతంగా రాణిస్తున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో హ్యాట్రిక్ తీసి సత్తాచాటాడు. వరుణ్ అరోన్, రియాన్ పరాగ్, ఉనద్కట్, ఒషానే థామస్​లు రాణించాల్సిన అవసరం ఉంది.

జట్లు (అంచనా)

రాజస్థాన్ రాయల్స్
రహానే (సారథి), స్టువర్ట్ బిన్నీ, వరుణ్ అరోన్, జయదేవ్ ఉనద్కట్, సంజు శాంసన్, శ్రేయస్ గోపాల్, లివింగ్​స్టోన్, మహిపాల్ లోమ్రోర్, ఒషానే థామస్, రియాన్ పరాగ్, టర్నర్

దిల్లీ క్యాపిటల్స్
శ్రేయస్ అయ్యర్ (సారథి), శిఖర్ ధావన్, అమిత్ మిశ్రా, కొలిన్ ఇన్​గ్రామ్, బౌల్డ్, క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్, జగదీశ సుచిత్, రిషభ్ పంత్, పృథ్వీషా, రూథర్​ఫోర్డ్

ABOUT THE AUTHOR

...view details