చెన్నై జట్టులో వయసు రీత్యా పెద్ద ఆటగాళ్లున్నా బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించగల సత్తా ఉందని ధీమాగా చెప్పాడు ధోని.
'డాడీస్ ఆర్మీ' సత్తా తెలిసిందా ఇప్పుడు? - కేదార్
మంగళవారం దిల్లీ క్యాపిటల్స్‌పై ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ధోని తమ జట్టుకు మంచి ఫీల్డింగ్ లేకపోయినా పరుగులను ఆపగలిగే బౌలింగ్ దళం ఉందని కితాబిచ్చాడు.
ఈ విజయంతో 'డాడీస్ ఆర్మీ' సత్తా తెలిసిందా..?
' మేము గ్రౌండ్ మొత్తాన్ని బాగా కవర్ చేయగలిగాం. మా ఆటగాళ్లు గ్రేట్ ఫీల్డర్స్ కాకపోయినా సేఫ్ ఫీల్డింగ్ చేయగలరు. అక్కడక్కడా పరుగులు విడిచిపెట్టినా.. మా జట్టుకు బౌలింగ్, బ్యాటింగ్‌లో మంచి అనుభవం ఉంది.
--ధోని, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి
.
- చెన్నై జట్టులో ఆటగాళ్లు వయసులో అన్ని జట్ల కన్నా పెద్దవాళ్లు. ధోని వయసు 37 సంవత్సరాలు, షేన్ వాట్సన్ 35, డ్వేన్ బ్రావో 34, ఇమ్రాన్ తాహిర్ 39, హర్భజన్ 38, డుప్లెసిస్ 34, అంబటి రాయుడు 33, కేదార్ 33, సురేశ్ రైనా 32 ఏళ్ల వయసు కలిగి ఉన్నారు.
- చెన్నై జట్టులోని బౌలర్లపై ధోని ప్రశంసలు కురిపించాడు. చిన్నపాటి తప్పిదాలు సహా దిల్లీ క్యాపిటల్స్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో విజయం సాధించామని స్పష్టం చేశాడు.
- ఐపీఎల్ వేలం సమయంలో తమ జట్టులో పెద్ద వయసున్న వాళ్లు ఉన్నందున.. కొందరు 'డాడీస్ ఆర్మీ' అంటూ పిలిచినట్లు ఇటీవల ఓ వేడుకలో మహీ గుర్తుచేసుకున్న విషయం తెలిసిందే.