ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న నేటి ఐపీఎల్ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. సొంతగడ్డపై ఆడుతుండటం కోల్కతాకు కలిసొచ్చే అంశం. వీరిద్దరూ తలపడిన గత మ్యాచ్లో విజయం చెన్నైనే వరించింది. ఆ మ్యాచ్లో నైట్రైడర్స్ ఆటగాడు రసెల్ మినహా అందరూ విఫలమయయ్యారు. సీఎస్కేలోనూ డుప్లెసిస్ ఒక్కడే రాణించాడు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు అగ్రస్థానంలో ఉన్నాయి. మరి రెండింటిలో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.