తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈడెన్​లో కోల్​కతాపై చెన్నై గెలుపు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో చెన్నై గెలిచింది. నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రైనా 58 పరుగులతో రాణించాడు.

ఈ'డెన్'​లో కోల్​కతాపై చెన్నై గెలుపు

By

Published : Apr 14, 2019, 8:15 PM IST

కోల్​కతా వేదికగా జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్​కతా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది. రైనా.. ఈ సీజన్​లో తొలి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. చివరి వరకు నిలిచి 58 పరుగులు సాధించాడు.

రైనా నిలిచాడు.. మ్యాచ్ గెలిపించాడు

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు మంచి ఆరంభమే లభించింది. డుప్లెసిస్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. మరో ఓపెనర్ వాట్సన్ 6 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. వన్​డౌన్​లో దిగిన రైనా స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే 24 రన్స్ చేసిన డుప్లెసిస్ నరైన్ బౌలింగ్​లో ఔటయ్యాడు.

చివరి వరకు నిలిచిన రైనా 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్​లో 36వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. మిగతా బ్యాట్స్​మెన్​లో రాయుడు 5, జాదవ్ 20, ధోని 16, జడేజా 31 పరుగులు చేశారు.

కోల్​కతా బౌలర్లలో నరైన్, చావ్లా తలో రెండు వికెట్లు తీశారు. హ్యారీ గుర్నే ఒక వికెట్ సాధించాడు.

లిన్ ఒక్కడే..

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోల్​కతాకు ఓపెనర్ లిన్ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. సహచర బ్యాట్స్​మెన్ నుంచి సహకారం లేకున్నా 82 పరుగులు చేసి జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్​లో 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.

82 పరుగులతో ఆకట్టుకున్న క్రిస్ లిన్

మిగతా వారిలో నరైన్ 2, నితీశ్ రానా 21, దినేశ్ కార్తీక్ 18, రసెల్ 10, శుభ్​మన్ గిల్ 15, చావ్లా 4 పరుగులు చేశారు. ఊతప్ప, కుల్దీప్ డకౌట్​ అయ్యారు.

తాహిర్ తడాఖా

చెన్నై బౌలర్లలో తాహిర్.. 27 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. రసెల్, లిన్, నితీశ్ రానా, ఊతప్ప ఇతని బౌలింగ్​లోనే ఔటయ్యారు. శార్దుల్ ఠాకుర్ 2 వికెట్లు, శాంట్నర్ ఒక వికెట్ తీశాడు.

వికెట్ తీసిన ఆనందంలో ఇమ్రాన్ తాహిర్

ABOUT THE AUTHOR

...view details