చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇప్పటికే 3 సార్లు ఫైనల్లో తలపడగా రెండు సార్లు (2013, 2015) ముంబయి గెలవగా... ఒకసారి చెన్నై విజయం సాధించింది.
పిచ్.. బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది. వర్షం పడే సూచన కనిపిస్తోంది. ఎనిమిదో సారి ఫైనల్ ఆడబోతుంది చెన్నై. 2010లో మినహా ఫైనల్కెళ్లిన ప్రతిసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది ముంబయి ఇండియన్స్.
జట్టులో ఓ మార్పు చేసింది ముంబయి ఇండియన్స్. జయంత్ యాదవ్ స్థానంలో మిచెల్ మెక్లెనెగన్కు అవకాశం కల్పించింది. చెన్నై కూడా ఓ మార్పుతో బరిలో దిగనుంది. మురళీ విజయ్ స్థానంలో శార్దుల్ ఠాకుర్ ఆడనున్నాడు.
జట్లు