తెలంగాణ

telangana

ETV Bharat / sports

తమిళ ఉగాదికి సీఎస్కే అదిరే బహుమతి

చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు.. తమిళ అభిమానులకు అదిరే బహుమతినిచ్చారు. తమిళం నేర్చుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

తమిళ న్యూయర్​కు సీఎస్కే అదిరే బహుమతి

By

Published : Apr 14, 2019, 4:34 PM IST

ఐపీఎల్​లో అభిమానగణం ఎక్కువగా ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఎంతగానో సహకరిస్తున్న అభిమానులకు సీఎస్కే యాజమాన్యం ఓ బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. తమిళ కొత్త సంవత్సరం కానుకగా జట్టులోని సభ్యులు అందరూ ఓ చిత్రమైన పని చేశారు. తమిళం రాయడం రాకపోయినా సరే నేర్చుకుని వారి వారి పేర్లను రాసి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అభిమానులపై ప్రేమను ఈ విధంగా చాటుకున్నారు. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చెన్నై యాజమాన్యం.

ABOUT THE AUTHOR

...view details