ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరినచెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తోంది . ఆడిన 10 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్ బెర్తు కోసం పోటీ పడుతోంది ముంబయి ఇండియన్స్. ఇరుజట్ల మధ్య నేడు చెన్నై వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరుగనుంది.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్‌లో వాట్సన్ ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. సురేష్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్ కూడా రాణించాలని కోరుకుంటోంది యాజమాన్యం. ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న కేదార్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు ముందు ఫామ్ నిరూపించుకోవల్సిన అవసరం ఉంది.
చెన్నై విజయంలో బౌలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. సొంత మైదానంలో అయితే అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నారు. దీపక్ చాహర్ ఈ సీజన్లో బాగా రాణిస్తున్నాడు. ఇమ్రాన్ తాహిర్ 16 వికెట్లతో సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్లేమీ తీయలేదు. జడేజా, హర్భజన్‌తో కలిసి ముంబయిపై మంచి ప్రదర్శన చేయాలని భావిస్తున్నాడీ దక్షిణాఫ్రికా స్పిన్నర్.
చెన్నై లాంటి ప్రత్యర్థిపై గెలవాలంటే ముంబయి సమష్టి ప్రదర్శన కనబర్చాల్సిందే. రోహిత్ శర్మ నుంచి భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు అభిమానులు. డికాక్, పొలార్డ్, పాండ్య సోదరులు ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం.