తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రిస్​ లిన్​ మెరిశాడు.. చెన్నై లక్ష్యం 162 - IPL 2019

కోల్​కతా వేదికగా జరిగిన  మ్యాచ్​లో నైట్​రైడర్స్ బ్యాట్స్​మెన్... చెన్నై ముందు 162 పరుగుల లక్ష్యాన్ని నిలిపారు. క్రిస్ లిన్ 82 పరుగులతో ఆకట్టుకున్నాడు.

క్రిస్ లిన్ మెరిశాడు..చెన్నై లక్ష్యం 162

By

Published : Apr 14, 2019, 5:57 PM IST

ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో161 పరుగులు చేసింది కోల్​కతా నైట్​రైడర్స్ జట్టు. ఓపెనర్ క్రిస్ లిన్ 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు చెన్నై బౌలర్​ ఇమ్రాన్​ తాహిర్.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోల్​కతాకు ఓపెనర్ క్రిస్ లిన్ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఎండ్​లో ఉన్న నరైన్​కు అవకాశమివ్వకుండా చెలరేగి ఆడాడు. ఇరువురు తొలి వికెట్​కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్ ఎవరూ ఎక్కువసేపు నిలువ లేకపోయారు. నితీశ్ రానా ఒక్కడే 21 పరుగులతో రాణించాడు. ఐపీఎల్​లో 1000 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు.

దినేశ్​ కార్తిక్ 18, రసెల్ 10, శుభ్​మన్​ గిల్ 15, పియూష్ చావ్లా 4 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఊతప్ప డకౌట్​గా వెనుదిరిగాడు.

చెన్నై బౌలర్లలో తాహిర్ చెలరేగాడు. 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. మిగతా వారిలో శార్దుల్ ఠాకుర్ 2, శాంట్నర్ ఒక వికెట్ తీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details