తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నా హిట్టింగ్​కు కారణం అతడే...'

ఈ సీజన్​లో కోల్​కతా తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు ఆండ్రీ రసెల్. బ్యాటుతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. క్రిస్ గేల్ ఇచ్చిన సలహాలే ఇందుకు కారణమని చెప్పాడీ కరీబియన్ బ్యాట్స్​మన్. ​

'నా హిట్టింగ్​కు కారణం అతడే...'

By

Published : Apr 20, 2019, 3:45 PM IST

Updated : Apr 20, 2019, 4:42 PM IST

ఆండ్రీ రసెల్.. ప్రస్తుతం ఐపీఎల్​లో మార్మోగుతున్న పేరు. ప్రత్యర్థి ఎవరైనా సరే విధ్వంసక బ్యాటింగ్​తో వారిని భయపెడుతున్నాడు. ఇలా రాణించడానికి క్రికెటర్ క్రిస్ గేల్.. ప్రధాన కారణమని చెప్పాడు. కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కరిబీయన్ క్రికెటర్ ప్రస్తుతం బీభత్సమైన ఫామ్​లో ఉన్నాడు. 9 మ్యాచ్​లాడి 220.46 సగటుతో 377 పరుగులు చేశాడు.

శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్​లో కేవలం 25 బంతుల్లో 65 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇందులోని 62 పరుగులు బౌండరీల ద్వారా వచ్చినవే. ఈ టోర్నీలో ఇప్పటివరకు 39 సిక్స్​లు కొట్టాడీ బ్యాట్స్​మన్. 26 సిక్స్​లతో గేల్.. తర్వాతి స్థానంలో ఉన్నాడు.

"నా ఆట మారేందుకు క్రిస్ గేల్ ప్రధాన కారణం. అతడి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. నేను తేలికైన బ్యాట్స్ ఉపయోగించేవాడ్ని. 2016 టీట్వంటీ ప్రపంచకప్​ సమయంలో నా దగ్గరకు వచ్చిన గేల్.. బరువైన బ్యాట్​ వాడాలని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి నా ఆట తీరు మారిపోయింది" -ఆండ్రీ రసెల్, కరీబియన్ క్రికెటర్​

ఈ ఐపీఎల్​ సీజన్​లో కోల్​కతా.. కొన్ని మ్యాచ్​ల్లో గెలవడానికి రసెల్ ప్రధాన కారణం. బంతితో,బ్యాటుతోనూ రాణిస్తూ క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు.

Last Updated : Apr 20, 2019, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details