క్రిస్ గేల్.. క్రికెట్ అభిమానులు ఆనందంతో గంతులేసే పేరు ఇది. టీట్వంటీల్లో ప్రభంజనం సృష్టించాలంటే వయసు అడ్డం కాదని నిరూపించాడు. 40 ఏళ్లలోనూ అవలీలగా సిక్సర్లు కొట్టేస్తున్నాడు. నిన్నటి ఐపీఎల్ పోరులో 99 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అయినా తన పేరిట రికార్డు లిఖించుకున్నాడు.
టీట్వంటీల్లో 100 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు సాధించిన క్రికెటర్గా ఘనత సాధించాడు. ఈ జాబితాలో వార్నర్ (73 సార్లు) మాత్రమే గేల్ తర్వాత స్థానంలో ఉన్నాడు.