తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) ఆధ్వర్యంలో నడుస్తోన్న చిదంబరం స్టేడియం దేశంలోని పాత స్టేడియాలలో ఒకటి. అయితే ఇందులో 50 వేల మంది కూర్చుని వీక్షించే అవకాశం ఉన్నా...38వేల మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
- ఏంటి కారణం..??
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) ఆధ్వర్యంలో నడుస్తోన్న చిదంబరం స్టేడియం దేశంలోని పాత స్టేడియాలలో ఒకటి. అయితే ఇందులో 50 వేల మంది కూర్చుని వీక్షించే అవకాశం ఉన్నా...38వేల మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
ఈ స్టేడియంలో మూడు స్టాండ్లు(ఐ, జే, కే) ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి. ఈ మూడింటి సామర్థ్యం 12 వేల సీట్లు. ఒక్కొక్కటి 4వేల సామర్థ్యం కలవి. అయితే 2011 నవంబరు నుంచి ఈ స్టాండ్లలో ప్రవేశం నిషేధించారు. చెపాక్ స్టేడియం నిర్మించే సమయంలో అనుమతులు లేకుండా స్టాండ్లను కలుపుతూ వ్యాయామశాల నిర్మించింది మద్రాసు క్రికెట్ క్లబ్. అయితే ఇది చట్టవిరుద్ధంగా నిర్మాణం జరిగిందని టీఎన్‌సీఏ పై కేసు సైతం నమోదైంది. ఆ తీర్పులో భాగంగా మద్రాసు హైకోర్టు ఈ స్టాండ్ల వాడకంపై స్టే విధించింది. ఇదే వివాదంపై టీఎన్‌సీఏ పై 2013లో క్రిమినల్ కేసు సైతం ఉంది.
ఆయా స్టాండ్లను పడగొట్టాలని 2015లో సుప్రీంకోర్టు తమిళనాడు క్రికెట్ సంఘానికి ఆదేశాలిచ్చింది. టీఎన్‌సీఏ వీటి నిర్మాణంపై ప్రణాళిక తయారుచేసి చెన్నై మున్సిపల్ కార్పొరేషన్‌కు అందజేయాలని సూచించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను టీఎన్‌సీఏ స్వాగతించినా నిర్మాణానికిి కావలసిన అనుమతులు ఇప్పటికీ తమిళనాడు ప్రభుత్వం నుంచి రాలేదు. ఇది పురాతన స్టేడియం కావడంతో పడగొట్టి కొత్తగా నిర్మించేందుకు ఆ రాష్ట్ర పురావస్తు శాఖ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.