గేల్ హిట్టింగ్, అశ్విన్ స్పిన్ మాయాజాలంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బరిలో దిగుతుండగా.. వాట్సన్, రైనా విధ్వంసం, ధోని వ్యూహాలు.. హర్భజన్, జడేజా, తాహిర్ స్పిన్‌తో పోరుకు సై అంటోంది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై చెపాక్ వేదికగా నేడు ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 4గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో చెరో మూడు నెగ్గి జోరుమీదున్నాయి చెన్నై, పంజాబ్.
- ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఇరుజట్లు ఆరాటపడుతున్నాయి. మొదటి మూడు మ్యాచ్‌లు అవలీలగా గెలిచిన చెన్నై జట్టు.. ముంబయిపై పరాజయం పాలైంది. ఈ సీజన్లో తొలిసారి ఓడిపోయిన ధోనిసేన పంజాబ్‌పై ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. మరోపక్క రెండు మ్యాచ్‌లు వరుసగా గెలిచిన పంజాబ్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది.
చెన్నై సూపర్ కింగ్స్:
కెప్టెన్ కూల్ ధోని చెన్నైకి ప్రధాన బలం. మైదానంలో ఆటగాళ్లకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చడంలో దిట్ట. వాట్సన్, సురేశ్ రైనా, ధోని, బ్రావోలతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. అయితే గాయం కారణంగా బ్రావో మ్యాచ్ ఆడేది అనుమానమే. అతని స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ స్కాట్ ఆడే అవకాశముంది.
- హర్భజన్, తాహిర్, జడేజాలతో స్పిన్ విభాగం దుర్భేద్యంగా ఉంది. పేస్ బౌలింగ్‌లో మోహిత్ శర్మ, బ్రావో, శార్దూల్ ఠాకుర్ లాంటి అంతర్జాతీయ బౌలర్లున్నారు. అయితే అంబటి రాయుడు ఫామ్ అందుకోవాల్సి ఉంది. అతని స్థానంలో మురళీ విజయ్‌ని తీసుకునే అవకాశం లేకపోలేదు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: