తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్​ గెలిచిన చెన్నై.. దిల్లీ బ్యాటింగ్ - match

విశాఖ వేదికగా దిల్లీతో జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్​కు చేరుతుంది.

టాస్

By

Published : May 10, 2019, 7:09 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న క్వాలిఫయర్​-2 మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. విశాఖ వేదికగా జరిగే ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు ఫైనల్​కు చేరుతుంది. లీగ్​లో దిల్లీతో జరిగిన రెండు మ్యాచ్​ల్లోనూ చెన్నై సూపర్​కింగ్సే విజయం సాధించింది.

పిచ్​ బ్యాటింగ్​కు అనుకూలించే అవకాశముంది. జట్టులో మార్పులేమి చేయకుండానే బరిలో దిగుతోంది దిల్లీ క్యాపిటల్స్​. టీమ్​లో ఓ మార్పు చేసింది చెన్నై. విజయ్​ స్థానంలో శార్దుల్ ఠాకుర్​కు అవకాశమిచ్చింది.

జట్లు..

చెన్నై సూపర్ కింగ్స్

వాట్సన్, డుప్లెసిస్, రైనా, రాయుడు, ధోని(కెప్టెన్), దీపక్​ చాహర్, బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్, తాహిర్, శార్దుల్ ఠాకుర్, శాంట్నర్

దిల్లీ క్యాపిటల్స్

ధావన్, పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), కొలిన్ మన్రో, రిషభ్ పంత్, రూథర్​ఫర్డ్, అక్షర్ పటేల్, కీమోపాల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, బౌల్ట్

ABOUT THE AUTHOR

...view details