బెంగళూరు- ముంబయి మధ్య గురువారం జరిగిన మ్యాచ్ చూసినవాళ్లకు యువీ మళ్లీ ఆరుసిక్సర్లు కోడతాడేమో అనిపించింది. కానీ కొంచెంలో మిస్సయ్యాడు యువరాజ్. చాహల్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు యువీ. నాలుగో బంతి దాదాపు సిక్సర్ అనుకునేలోపు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీనిపై స్పందించాడు యువ బౌలర్ యజువేంద్ర చాహల్. తన బౌలింగ్లో యువీ మూడో సిక్సర్ కొట్టిన తర్వాత తాను మరో స్టువర్ట్ బ్రాడ్ని అవుతానేమో అని భయపడ్డానని చాహల్ మ్యాచ్ తర్వాత చెప్పాడు.
మరో స్టువర్ట్ బ్రాడ్ అయ్యేవాడినే: చాహల్ - సిక్సర్లు
"యువీ 3 సిక్సర్లు కొట్టగానే.. మరో స్టువర్ట్ బ్రాడ్ అవుతానేమోనని భయపడ్డాను" అని బెంగళూరు యవ బౌలర్ యజువేంద్ర చాహల్ తెలిపాడు.
చాహల్