క్రికెటర్ బ్రావో సరికొత్త అవతారం..! - వెస్టిండిస్
క్రికెటర్ డ్వేన్ బ్రావో ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ గాయపడగా విశ్రాంతినిచ్చింది చెన్నై యాజమాన్యం. ఈ సమయంలో ఖాళీగా ఉన్నఈ కరీబియన్ ఆటగాడు సరికొత్త అవతారం ఎత్తాడు.
ఆల్‌రౌండర్ బ్రావో సరికొత్త అవతారం..!
వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో సింగర్‌గా, డ్యాన్సర్‌గా చాలా సార్లు ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడీ క్రికెటర్. అయితే ఖాళీ ఉంటే బోర్ కొట్టిందో ఏమో...సహచర ఆటగాడు మోనూ సింగ్‌కు హెయిర్ స్టయిలిస్టుగా మారాడు. ఏదైనా తప్పు జరిగితే లక్ష చెల్లిస్తానంటూ పందెం కట్టాడు. చివరికి మోనూ గడ్డాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఔరా అనిపించుకున్నాడు బ్రావో.