ప్రస్తుత ఐపీఎల్లో అదరగొడుతున్నాడు ఆండ్రీ రసెల్. ఆదివారం ముంబయితో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోల్‌కతా తరఫున 40 బంతుల్లో 80 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. క్రికెట్ అభిమానులు.. అతడ్ని సూపర్ హీరో అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. స్పందించిన ఈ కరీబియన్ ఆటగాడు.. ఈ విషయం తనకెంతో సంతోషం కలిగించిందని చెప్పాడు.
'సూపర్ హీరో అనడం ఆనందకరం' - KOLKATTA KNIGHT RAIDERS
ఐపీఎల్లో కోల్‌కతా తరఫున అదరగొడుతున్నాడు ఆండ్రీ రసెల్. అభిమానులు అతడ్ని సూపర్ హీరో అంటూ పొగుడుతున్నారు. ఇలా పిలవడం తనకెంతో ఆనందంగా ఉందన్నాడీ కరీబియన్ ఆటగాడు.
'సూపర్ హీరో అంటుంటే ఆనందంగా ఉంది'
"అవును నేను అవెంజర్స్‌కు అభిమానినే. ఆ సినిమాల్ని తప్పకుండా చూస్తుంటా. క్రికెట్ అభిమానులు నన్ను సూపర్ హీరో అని పిలుస్తుంటే ఆనందంగా ఉంది." -ఆండ్రీ రసెల్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు.
అదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయిపై 34 పరుగుల తేడాతో కోల్‌కతా గెలుపొందింది. ఫ్లేఆఫ్స్ అవకాశాల్ని సజీవం చేసుకుంది. మే3న పంజాబ్‌తో, మే5న ముంబయితో ఈ సీజన్లో మిగతా మ్యాచ్‌లు ఆడనుంది.