తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉత్కంఠ పోరులో కోహ్లీ సేనదే గెలుపు

ఈడెన్ ​గార్డెన్స్​ వేదికగా  కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓ వైపు కోహ్లీ, మొయిన్​ అలీ ... మరోవైపు రాణా,రస్సెల్​ బౌండరీల వర్షం కురిపించారు.

By

Published : Apr 20, 2019, 12:34 AM IST

ఈడెన్​లో మెరుపులు...ఆఖర్లో బెంగళూరు విజయం

ఐపీఎల్‌-12వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రెండో విజయం ఖాతాలో వేసుకుంది. 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు 203 పరుగులే చేయగలిగింది కోల్​కతా.

రాణా, రస్సెల్​ బీభత్సం

214 పరుగుల భారీ లక్ష్యం... డేల్​ స్టెయిన్​ లాంటి బౌలర్​ జట్టులో ఉండటం.. ఇంకేమి ఆర్సీబీ విజయానికి అడ్డేమి లేదనుకుంది కోహ్లీ సేన. కాని కోల్​కతాను ఈ సీజన్​లో పరుగులెత్తిస్తున్న హిట్టర్​ ఆండ్రూ రస్సెల్​ (65: 25 బంతుల్లో 2ఫోర్లు, 9సిక్సర్లు) మరోసారి విశ్వరూపం చూపించాడు. అతడికి తోడు నితీశ్​ రాణా (85: 46 బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సర్లు) విజృంభించాడు. వీరద్దరి ముందు భారీ లక్ష్యం చిన్నబోయింది. చివరి ఓవర్లో 24 పరుగులు కొట్టాల్సిన సమయంలో బంతి అందుకున్న స్పిన్నర్​ మొయిన్​ అలీ.. కోల్​కతా విజయాన్ని అడ్డుకున్నాడు.
బెంగళూరు బౌలర్లలో స్టెయిన్​ రెండు, సైనీ, స్టాయినిస్​ తలో వికెట్​ తీశారు.

విరాట్​ శతక్కొట్టుడు...

ముందు బ్యాటింగ్​ చేసిన ఆర్సీబీ జట్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(100: 58 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు శతకంతో పరుగుల సునామీ సృష్టించాడు. కోహ్లీతో పాటు మొయిన్‌ అలీ(66: 28 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు) విజృంభించడంతో 20 ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లకు 213 పరుగులు చేసింది.

గుర్నీ, సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రస్సెల్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. బెంగళూరు ఓపెనర్‌ పార్థీవ్‌ పటేల్‌(11) మరోసారి విఫలం కాగా అక్షదీప్‌ నాథ్‌(13) నిరాశపరిచాడు.

ఈ సీజన్​లో అత్యధిక పరుగుల వీరుల్లో విరాట్​ మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్​లో కోహ్లీకి ఇది ఐదో శతకం. కోహ్లీకన్నా ముందు ఆరు సెంచరీలతో క్రిస్​ గేల్​ మొదటి స్థానంలో ఉన్నాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details