సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. మిస్టర్ 360 డివిలియర్స్ చెలరేగి ఆడాడు. చివరి వరకు క్రీజులో నిలిచి 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌గా వచ్చిన పార్థివ్ పటేల్ 43 పరుగులతో మెరిశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం లభించలేదు. ఓ వైపు పార్థివ్ పటేల్ చెలరేగి ఆడగా... మరో ఎండ్‌లో ఉన్న కోహ్లి కేవలం 13 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన డివిలియర్స్ స్కోరు బోర్డను నెమ్మదిగా పరుగులు పెట్టించాడు. దీంతో ఈ సీజన్లోనే పవర్ ప్లేలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది బెంగళూరు. 6 ఓవర్లు ముగిసే సరికి 70 పరుగులు చేశారు.