వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. డివిలియర్స్ 74 పరుగులతో రాణించాడు. ముంబయి బౌలర్లలో మలింగకు 4 వికెట్లు దక్కాయి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న కోహ్లి.. నేడు 8 పరుగులే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ పార్థివ్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 28 పరుగులు చేసి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ..డివిలియర్స్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ క్రమంలోనే అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
50 పరుగులు చేసిన అలీ... మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 75 పరుగులు చేసిన డివిలియర్స్.. మలింగ వేసిన చివరి ఓవర్లో పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షదీప్ నాథ్, పవన్ నేగి వెంట వెంటనే వెనుదిరిగారు.
ముంబయి బౌలర్లలో మలింగకు నాలుగు వికెట్లు, బెరెండార్ఫ్, హార్దిక్ పాండ్యకు తలో వికెట్ దక్కింది.