తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్, ఏబీ విజృంభణ.. కోల్​కతా లక్ష్యం 206 - విరాట్

గెలుపు కోసం ఎంతో ఎదురు చూస్తున్న రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్​కతాతో జరుగుతున్న మ్యాచ్​లో నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది విరాట్​ సేన. కోహ్లీ, డివిలియర్స్ అర్ధశతకాలతో అదరగొట్టారు.

బెంగళూరు

By

Published : Apr 5, 2019, 9:49 PM IST

Updated : Apr 5, 2019, 11:12 PM IST

కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు 206 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోహ్లీ సేన ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. కోహ్లీ(84, 49 బంతుల్లో), డివిలియర్స్(63, 32 బంతుల్లో)​ అర్ధ శతకాలతో అదరగొట్టారు. గెలవాలనే కసితో బరిలో దిగిన ఆర్సీబీకి శుభారంభం దక్కింది. పవర్​ప్లే ముగిసే సమయానికి 53 పరుగులు చేసింది కోహ్లీ- పటేల్ జోడి.

కోహ్లీ, డివిలియర్స్ మెరుపులు..

విరాట్ కోహ్లీ

64 పరుగుల వద్ద పార్థివ్(25) ఔటైనా... అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ విజృంభించాడు. అప్పటికే దూకుడుగా ఆడుతున్నాడు కోహ్లీకి.. అగ్నికి వాయువు తోడైనట్టు ఏబీ జత కలిశాడు. బౌండరీలు, సిక్సర్లతో ఇద్దరూ స్టేడియాన్ని హోరెత్తించారు. 35 బంతుల్లో విరాట్ అర్థ శతకం పూర్తి చేయగా.. డివిలియర్స్​ 28 బంతుల్లోనే అందుకున్నాడు. 84 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్దీప్​కి క్యాచ్​ ఇచ్చి విరాట్​ వెనుదిరిగాడు. అనంతరం కొద్ది సేపటికే నరైన్​ బౌలింగ్​లో డివిలియర్స్ పెవిలియన్​ చేరాడు. చివర్లో పరుగుల వేగం నెమ్మదించి బెంగళూరు అనుకున్నంత స్కోరు సాధించలేకపోయింది.

కోల్​కతా బౌలర్లు ఆరంభం నుంచి అంతగా ప్రభావం చూపించలేదు. సునీల్ నరైన్ మినహా ప్రతి ఒక్కరి బౌలింగ్​ను బాదేశారు బెంగళూరు బ్యాట్స్​మెన్. నితీశ్ రానా, కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్.. తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Last Updated : Apr 5, 2019, 11:12 PM IST

ABOUT THE AUTHOR

...view details