తెలంగాణ

telangana

ETV Bharat / sports

శతకంతో రెచ్చిపోయిన రహానే.. దిల్లీ లక్ష్యం 192 - rahane

జైపుర్ వేదికగా దిల్లీతో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్​ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. రహానే సెంచరీతో (105) విజృంభించగా... స్మిత్ అర్ధశతకం (50) చేశాడు. దిల్లీ బౌలర్లలో అక్షర్, ఇషాంత్, మోరిస్ తలో వికెట్ తీశారు.

రహానే

By

Published : Apr 22, 2019, 10:04 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​ భారీ స్కోరు సాధించింది. జైపుర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ జట్టులో రహానే శతకంతో (105) విజృంభించగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దిల్లీ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రబాడ రెండు వికెట్లు తీసుకున్నాడు. రహానే ధాటికి పది ఓవర్లకే 90కి పైగా పరుగుల చేసింది రాజస్థాన్.

సెంచరీతో కదంతొక్కిన రహానే..

ఆరంభంలోనే రాజస్థాన్ బ్యాట్స్​మెన్ సంజూ శాంసన్ రనౌట్​గా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన రహానే - స్మిత్ జోడి నిలకడగా ఆడుతూ స్కోరు వేగం పెంచింది. అజింక్య రహానే వేగంగా ఆడుతూ 58 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇది రహానేకు ఐపీఎల్​లో రెండో శతకం. మరోవైపు నిలకడగా ఆడిన స్మిత్.. 32 బంతుల్లో అర్ధశతకం చేశాడు. అనంతరం అక్షర్ బౌలింగ్​లో ఔటయ్యాడు. వీరిద్దరి ధాటికి స్కోరు 200 దాటుతుందని రాజస్థాన్ అభిమానులు ఆశించారు. కానీ చివర్లో బ్యాట్స్​మెన్ వేగంగా పరుగులు చేయలేకపోయారు.

రాణించిన స్మిత్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ... అంత ప్రభావం చూపలేకపోయింది. రహానే - స్మిత్ జోడిని విడదీయడంలో ఇబ్బంది పడ్డారు దిల్లీ బౌలర్లు. ముఖ్యంగా రహానేను కట్టడి చేయలేకపోయారు. నాలుగో ఓవర్లనే రహానే ఇచ్చిన క్యాచ్​ని వదిలేసి మూల్యం చెల్లించుకుంది క్యాపిటల్స్ జట్టు. దిల్లీ బౌలర్లలో రబాడ 2 వికట్ల తీయగా అక్షర్ పటేల్, క్రిస్​ మోరిస్, ఇషాంత్ శర్మ తలో ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

రాజస్థాన్ బ్యాట్స్​మెన్ టర్నర్​ వరుసగా మూడు మ్యాచ్​ల్లో గోల్డెన్​ డక్​గా వెనుదిరిగాడు.

ABOUT THE AUTHOR

...view details