తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL: ఐపీఎల్ మిగతా మ్యాచ్​ల షెడ్యూల్ ఇదే!

నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్​ రెండో దశ షెడ్యూల్​ ఖరారైనట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు మిగిలిన మ్యాచ్​ల్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

IPL
ఐపీఎల్‌

By

Published : Jun 7, 2021, 3:31 PM IST

Updated : Jun 7, 2021, 4:30 PM IST

ఈ ఏడాది కరోనా కారణంగా అర్ధాంతంగా ఆగిపోయిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. మిగిలిన 31 మ్యాచ్‌లు యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి పునఃప్రారంభించబోతున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అక్టోబర్‌ 15న ఫైనల్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇదీ జరిగింది

ఇటీవల భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ బయో బుడగలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటం వల్ల మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. దాంతో మిగిలిన 31 మ్యాచ్‌లను ఎలాగైనా పూర్తి చేయాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. అయితే, ఆ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 10లోపు పూర్తిచేయాలని చూస్తున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌ 19న టోర్నీని తిరిగి ప్రారంభించి.. అక్టోబర్‌ 15న ఫైనల్‌తో ముగించాలని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.

ఇందుకు సంబంధించి ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు నిర్వహకులతో పాటు, యూఏఈ అధికారులతో చర్చలు జరిపినట్లు సదరు అధికారి అన్నారు. బీసీసీఐ జనరల్‌ మీటింగ్‌కు ముందే యూఏఈలోని మూడు స్టేడియాల్లో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చని ఈసీబీ స్పష్టతనిచ్చిందని, దాంతో ఇప్పుడు మిగిలిన చర్చలు కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. మిగిలిన 31 మ్యాచ్‌ల కోసం బీసీసీఐ 25 రోజుల విండో కావాలని ఆశించినట్లు అధికారి పేర్కొన్నారు.

దిల్లీ క్యాపిటల్స్​ అగ్రస్థానం

టోర్నీ మధ్యలో ఆగిపోయేసరికి దిల్లీ క్యాపిటల్స్‌ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి అందరి కన్నా ముందుంది. తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చెరో 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. మరి రెండో భాగంలో ఎవరు ఎలా రాణిస్తారో వేచి చూడాలి. ఐపీఎల్‌ కోసం అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Last Updated : Jun 7, 2021, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details