చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఫామ్‌పై తనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. వ్యక్తిగత ప్రదర్శనలు కాకుండా.. జట్టుగా ఎలా ఉన్నాము అన్నదే ప్రస్తుతం తమకు ముఖ్యమన్నాడు.
"ఇది అసలు ఆలోచించాల్సిన విషయమే కాదని నా అభిప్రాయం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఎవరు ఎక్కడ ఉన్నారు అని ఆలోచించట్లేదు. జట్టుగా ఎంత దృఢంగా ఉన్నాము అన్నదే ఇప్పుడు మాకు ముఖ్యం. బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన చేసి జట్టుకు ఉపయోగపడాలని మేము చూస్తున్నాం. ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆ బాధ్యత తీసుకోవాలి."
-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా సారథి.
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీతో పాటు పుజారా, రహానే దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో రాహుల్, జడేజా, బుమ్రా ఆదుకోవడం వల్ల జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. కానీ టీమ్‌లో కీలక ఆటగాళ్లు విఫలమవ్వడం అభిమానులను కలవరపెడుతోంది. లార్డ్స్ వేదికగా రెండో టెస్టు గురువారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విరాట్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'పంత్ అలాగే ఆడతాడు..'