ఓవర్లో ఆరు సిక్సర్లను బాదిన రికార్డు అంటే భారత క్రికెట్ అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. అయితే ఈ రికార్డును(Yuvraj Singh Six Sixes) మరో ఇద్దరూ సాధించారు. కానీ, యువరాజ్ సింగ్ తర్వాత మళ్లీ అదే ఘనతను భారత సంతతి అమెరికన్ జస్కరన్ మల్హోత్రా(Jaskaran Malhotra Sixes) సాధించాడు.
ఓమన్ వేదికగా పపువా న్యూగినియా(USA Vs PNG) అమెరికా అంతర్జాతీయ వన్డేలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 271 స్కోరు చేసింది. అమెరికా ఇన్నింగ్స్‌లోని ఆఖరి ఓవర్‌ను పేసర్ గౌడి టోకా వేయగా.. అదే ఓవర్లోని ఆరు బంతులను జస్కరన్ మల్హోత్రా ఆరు సిక్సర్లు బాది అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీంతో ఆ మ్యాచ్‌లో(USA Vs PNG ODI) 173 వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు మల్హోత్రా.
యూఎస్ఏ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాకుండా అమెరికా క్రికెట్ జట్టుకు వన్డే హోదా వచ్చిన తర్వాత సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా జస్కరన్ మల్హోత్రా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 2019లో యూఏఈ వేదికగా జరిగిన వన్డేలో అరోన్ జాన్స్(95) శతకం దగ్గరగా వచ్చి వెనుదిరిగాడు.