తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అశ్విన్​ చేరికతో అత్యుత్తమ జట్టుగా టీమ్ఇండియా!'

భారత ఆఫ్​స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ ఆడేందుకు వీలైనన్ని అవకాశాలివ్వాలని బీసీసీఐ సెలెక్టర్లకు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​ ఇయాన్​ ఛాపెల్​ సూచించారు. అశ్విన్​ ఇప్పటికే తన ప్రదర్శనతో అన్ని పరిస్థితుల్లోనూ ఆడగలడని నిరూపించుకున్నట్లు తెలిపారు. మిడిల్​ ఆర్డర్​లో అశ్విన్​కు చోటిస్తే జట్టు మరింత పటిష్ఠంగా మారుందని అభిప్రాయపడ్డారు.

By

Published : Sep 12, 2021, 4:19 PM IST

Tweaking Indian middle order to accommodate Ashwin should be priority: Ian Chappell
'అశ్విన్​ చేరికతో అత్యుత్తమ జట్టుగా టీమ్ఇండియా!'

టీమ్‌ఇండియా సెలెక్టర్లు సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు తుది జట్టులో అవకాశమివ్వాలని సూచించారు ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్​ ఛాపెల్​. అశ్విన్​ ఇప్పటికే అన్ని పరిస్థితుల్లో సరైన బౌలర్‌ అని నిరూపించుకున్నాడని ఆయన పేర్కొన్నారు. ఓ క్రీడాఛానల్‌కు రాసిన కథనంలో ఇయాన్​ ఛాపెల్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమ్‌ఇండియా అన్ని విభాగాల్లో మెరుగైందని.. మిడిల్‌ ఆర్డర్‌లో అశ్విన్‌కు చోటిస్తే ఇంకా పటిష్ఠంగా మారుతుందని ఛాపెల్‌ అభిప్రాయపడ్డారు.

"అశ్విన్‌ చేరికతో టీమ్‌ఇండియా అత్యుత్తమ జట్టుగా మారుతుంది. అతడు అన్ని పరిస్థితుల్లో మేటి బౌలర్‌గా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ అది నిరూపించుకున్నాడు. అతడిని తుది జట్టులోకి తీసుకోవాలి."

- ఇయాన్​ ఛాపెల్​, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​

ఆ విషయంలో సెలెక్టర్లు చొరవ చూపాలని, ప్రస్తుతం టీమ్‌ఇండియా రిజర్వ్‌ బెంచ్‌ కూడా పటిష్ఠంగా ఉందని అన్నారు ఛాపెల్. కోహ్లీసేన అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉందని, అందుకు నిదర్శనం ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీస్‌లు గెలవడమే కాకుండా ఇంగ్లాండ్‌లోనూ ఆధిపత్యం చెలాయించిందని మాజీ సారథి గుర్తుచేశారు.

ఇక మిడిల్ ఆర్డర్‌లో.. జడేజా, అశ్విన్‌, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ను కలిగి ఉంటే భారత జట్టు పూర్తిస్థాయిలో బలంగా మారుతుందని ఛాపెల్‌ అభిప్రాయపడ్డాడు. జట్టులో కుడి, ఎడమ కాంబినేషన్‌ కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఇటీవల జరిగిన ఓవల్‌ టెస్టులో భారత్‌ జడేజాను ఐదో స్థానంలో ఆడించిందని వివరించారు. ఐదో స్థానంలో జడేజా నిరూపించుకుంటే పేస్‌ బౌలర్‌ ఆల్‌రౌండర్‌ అవసరమని అన్నారు. అప్పుడు హార్దిక్‌ పాండ్యా లేదా శార్దూల్‌ ఠాకూర్‌ ఉన్నారని పేర్కొన్నారు. ఇక లోయర్‌ ఆర్డర్‌లో ముగ్గురు పేస్‌బౌలర్లను వినియోగించుకుంటే జట్టు సమతూకంగా ఉంటుందని ఛాపెల్‌ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి..దిగ్గజాలే కానీ ప్రపంచకప్​ అందుకోలేకపోయారు!

ABOUT THE AUTHOR

...view details