తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ విజేతకు ప్రైజ్​మనీ ఎంతంటే? - టీ20 ప్రపంచకప్

ఐసీసీ టీ20 ప్రపంచకప్​(ICC T20 World Cup 2021) విజేత జట్టు అందుకోనున్న ప్రైజ్​మనీపై(T20 World Cup Prize Money) స్పష్టతనిచ్చింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC News). విజేతకు రూ.12.02 కోట్లు, రన్నరప్​ టీమ్​కు రూ.6 కోట్లు అందజేయనున్నట్లు తెలిపింది.

T20 WC: Winner to get USD 1.6 million, confirms ICC
టీ20 ప్రపంచకప్​ విజేతకు ప్రైజ్​మనీ ఎంతంటే?

By

Published : Oct 10, 2021, 3:57 PM IST

మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్​(ICC T20 World Cup 2021) ఘనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూఏఈ, ఓమన్​ వేదికల్లో ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. టోర్నీలో డీఎర్​ఎస్​ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC News) ప్రకటించింది. ఈ నేపథ్యంలో టోర్నీ విజేతకు ఇచ్చే ప్రైజ్​మనీపై ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేసింది ఐసీసీ.

టీ20 ప్రపంచకప్​ విజేతకు రూ.12.02 కోట్ల ప్రైజ్​మనీని(T20 World Cup Prize Money) బహుకరించనున్నట్లు ఐసీసీ తెలియజేసింది. రన్నరప్​ జట్టుకు విజేతకు ఇచ్చే బహుమానంలో సగభాగం అంటే రూ.6 కోట్లకు పైగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. అదేవిధంగా సెమీఫైనల్​లో ఓడిన రెండు జట్లు చెరో రూ.3 కోట్లను అందుకోనున్నాయి.

ఇదీ చూడండి..ICC News: టీ20 ప్రపంచకప్​లో ఇదే తొలిసారి

ABOUT THE AUTHOR

...view details