తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ విడుదల - టీ20 ప్రపంచకప్​

T20 WC: India to square off against Pak on Oct 24, match against NZ on Oct 31
ఐసీసీ టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ ఇదే

By

Published : Aug 17, 2021, 10:48 AM IST

Updated : Aug 17, 2021, 3:21 PM IST

10:42 August 17

అక్టోబరు 24న భారత్​-పాక్​ మ్యాచ్​

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్

దుబాయ్​ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్​ను అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) విడుదల చేసింది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అక్టోబరు 24న భారత్​-పాకిస్థాన్​ జట్లు తలపడనున్నట్లు స్పష్టం చేసింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో దాయాది జట్లు చివరిసారిగా పోటీపడ్డాయి. గ్రూప్​2లో ఉన్న భారత్​.. 31న న్యూజిలాండ్​తో, నవంబరు 3న అఫ్ఘానిస్థాన్​ తలపడనుంది.  

ఒమన్​తో పాటు యూఏఈలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నవంబరు 10, 11 తేదీల్లో టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్​ మ్యాచ్​లు జరుగుతాయి. నవంబరు 14న దుబాయ్‌లో ఫైనల్ జరగనుంది. 

Last Updated : Aug 17, 2021, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details