తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS SL: మూడో టీ20లో లంక విజయం.. సిరీస్​ కైవసం - ఇండియా వర్సెస్​ శ్రీలంక

మూడో టీ20లో శ్రీలంక ఘన విజయం సాధించింది. 82 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా సిరీస్​ను కైవసం చేసుకుంది.

sri lanka, team INDIA
IND VS SL: మూడో టీ20లో లంక విజయం.. సిరీస్​ కైవసం

By

Published : Jul 29, 2021, 11:02 PM IST

Updated : Jul 29, 2021, 11:38 PM IST

భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆతిథ్య శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడమే కాకుండా సంచలనంగా సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇంతకుముందు ఆడిన ఐదు టీ20 సిరీసుల్లో ఆ జట్టు వరుసగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యువ భారత్‌తో ఆడిన మూడో టీ20లో సునాయాస విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. దాంతో వరుస సిరీస్‌ ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టులో నూతనోత్సాహం నెలకొంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 82 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో ఛేదించింది. ధనంజయ డిసిల్వ (23 నాటౌట్‌; 20 బంతుల్లో 2x4), వానిండు హసరంగ (14 నాటౌట్‌; 9 బంతుల్లో 1x4) చివరి వరకు క్రీజులో నిల్చొని జట్టును విజయతీరాలకు చేర్చారు. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అవిష్క ఫెర్నాండో (12), మినోద్‌ భానుక (18), సమర విక్రమ(6)ను రాహుల్‌ చాహర్‌ ఔట్‌ చేశాడు.

తేలిపోయిన భారత్‌..

ఇక తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులే చేసి.. పొట్టి క్రికెట్‌లో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. 2008లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాపై అత్యల్ప టీ20 స్కోర్‌ 74 పరుగులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ (23 నాటౌట్‌; 28 బంతుల్లో), భువనేశ్వర్‌ కుమార్‌ (16; 32 బంతుల్లో) టాప్‌ స్కోరర్లుగా నిలిచి భారత్‌కు మరో అవమానకర పరిస్థితిని అడ్డుకున్నారు. శ్రీలంక బౌలర్లు వానిండు హసరంగ 4/9, డాసున్‌ శనక 2/20 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు.

టీమ్ఇండియాను శ్రీలంక ఆది నుంచే కట్టడి చేసింది. తొలి ఓవర్‌లో కెప్టెన్‌ ధావన్‌(0)ను ఔట్‌చేసి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నాలుగు, ఐదు ఓవర్లలో దేవ్‌దత్‌ పడిక్కల్‌(9), సంజూ శాంసన్‌(0), రుతురాజ్‌ గైక్వాడ్‌ (14; 10 బంతుల్లో 2x4) వరుసగా పెవిలియన్‌ చేరారు. తర్వాత నితీశ్‌ రాణా(6) సైతం విఫలమవడం వల్ల 36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పొట్టి క్రికెట్‌లో అత్యల్ప స్కోర్‌ నమోదు చేసేలా కనిపించింది. అయితే.. భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఆరో వికెట్‌కు 19 పరుగులు జోడించారు. చివరికి భువనేశ్వర్‌ 15వ ఓవర్‌లో ఔటయ్యాక.. టెయిలెండర్లతో కలిసి కుల్‌దీప్‌ జట్టు స్కోర్‌ను 81 పరుగులకు చేరవేశాడు. దాంతో భారత్‌కు టీ20ల్లో మరో అత్యల్ప స్కోర్‌ నమోదు కాకుండా చూశాడు.

ఇదీ చూడండి:-'ఇప్పుడైనా నవ్వు బాబు'.. గంభీర్​కు యూవీ పంచ్

Last Updated : Jul 29, 2021, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details