టీమ్ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను టీ20 ప్రపంచకప్ ప్రధాన జట్టులోకి తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI News) ప్రకటించింది. అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్‌కు అవకాశం ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే టీ20 ప్రపంచకప్ కోసం తొలిసారి ప్రకటించిన టీమ్‌లో శార్దూల్‌ను రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేయగా.. ఇప్పుడు అతడికి ప్రధాన జట్టులో ఆడే అవకాశం లభించింది.
టీ20 ప్రపంచకప్ భారత జట్టులో మార్పులు.. శార్దూల్‌కు చోటు - Team India
టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ప్రధాన జట్టులో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్‌ను తీసుకుంది.

టీ20 ప్రపంచకప్ భారత జట్టులో మార్పులు.. శార్దూల్‌కు చోటు
మరోవైపు యువ ఆటగాళ్లు ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లక్మన్ మేరివాలా, వెంకటేశ్ అయ్యర్, కరన్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్.. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు తమ సేవల్ని అందించనున్నారు. ఇందుకోసం వారంతా యూఏఈలో ఉన్న టీమ్ఇండియా శిబిరంలో చేరనున్నారు.
ఇదీ చూడండి..IPL 2021: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా కోల్‌కతా-దిల్లీ ఢీ.. ఇవి తెలుసుకోండి!