బుమ్రా గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో భారత పేస్ దళాన్ని హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ముందుండి నడిపిస్తున్నాడు. ఆడేది మూడో టెస్టే అయినప్పటికీ సహచర ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ సమర్థవంతంగా పేస్ బాధ్యతల్ని మోస్తున్నాడు. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. రెండో రోజు ఆటలో బంతితో ప్రభావం చూపినప్పటికీ వికెట్లు సాధించలేకపోయాడు.
ఈ నేపథ్యంలో సిరాజ్ బౌలింగ్‌ను దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ విశ్లేషించాడు. పిచ్‌పై ఉన్న పగుళ్లతో సిరాజ్.. స్వింగ్ రాబడుతున్నాడని వినిపిస్తున్న వాదనలను కొట్టిపారేశాడు. నైపుణ్యంతోనే స్వింగర్స్, కట్టర్స్‌ను అద్భుతంగా సంధిస్తున్నాడని ట్విట్టర్ వేదికగా ఓ వీడియోతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు మాస్టర్.