ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup 2021) భారత్ ఆడే మ్యాచ్‌లను తమ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ థియేటర్ల సంస్థ పీవీఆర్(PVR Cinemas News) ప్రకటించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలితో(ICC News) ఒప్పందం చేసుకున్నట్లు పీవీఆర్ లిమిటెడ్ సీఈఓ గౌతమ్ దత్తా వెల్లడించారు. దిల్లీ, ముంబయి, పూణె, అహ్మదాబాద్ సహా దేశంలోని 35 నగరాల్లో 75కు పైగా పీవీఆర్ స్క్రీన్లలో టీమ్ఇండియా మ్యాచ్‌లను ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు.
థియేటర్లలో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం - international cricket council
టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup 2021) భారత్ ఆడనున్న మ్యాచ్‌లను తమ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పీవీఆర్(PVR Cinemas News) ప్రకటించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలితో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు పీవీఆర్ సినిమాస్ సీఈఓ గౌతమ్ దత్తా తెలిపారు.
ఈ ప్రదర్శనల ద్వారా ప్రపంచకప్ మ్యాచ్‌లను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయవచ్చని పీవీఆర్ సీఈఓ గౌతమ్ దత్తా అన్నారు. సినిమా, క్రికెట్ రెండూ ఎంతో వినోదాన్ని అందిస్తాయన్న గౌతం దత్తా మ్యాచ్‌ను తెరపై చూస్తున్నప్పుడు స్టేడియంలో వీక్షించిన అనుభూతి.. అభిమానులకు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో భారత్(IND Vs PAK Match Live) తలపడనుండగా థియేటర్లలో వీక్షించే వారికి ఈ మ్యాచ్ మరింత వినోదాన్ని పంచనుందని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి..భారత్-పాక్ మ్యాచ్.. ఆ సూపర్ యాడ్ వచ్చేసింది