ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న(NZW Vs ENGW) న్యూజిలాండ్ మహిళల జట్టుకు బాంబు బెదిరింపులు(Bomb Threat) వచ్చాయి. ఈ విషయాన్ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించిందని కివీస్ బోర్డు ప్రకటించింది. అయితే, ఈ బెదిరింపులపై(New Zealand Bomb Threat) తమ భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని.. అవి ఉత్తుత్తివేనని స్పష్టం చేసింది. మహిళల క్రికెటర్లు బస చేసే హోటల్‌తో పాటు స్వదేశానికి తిరిగి వెళ్లేటప్పుడు విమానంలో బాంబులు పెడతామని ఈసీబీకి ఈమెయిల్ వచ్చినట్లు సమాచారం అందింది.
మరోవైపు పాకిస్థాన్ పర్యటనకు(NZ Vs PAK 2021) ముందే తమ పురుషుల జట్టులోని కొందరిని చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ చీఫ్ హీత్ మిల్స్ వెల్లడించారు. తొలుత అవి సామాజిక మాధ్యమాల్లో వచ్చాయని చెప్పారు. వాటిపై దర్యాప్తు చేసిన తమ భద్రతా నిపుణులు ఆ బెదిరింపులు ఉత్తివేనని తేల్చారన్నారు.