ప్రపంచంలోని అత్యంత ఆదరణ పొందిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. బ్రిటన్‌లో పుట్టిన ఈ క్రీడ అనతికాలంలోనే మరెన్నో దేశాలకు విస్తరించింది. ఫుట్‌బాల్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంతటి ప్రజాదరణ పొందిన క్రీడ క్రికెట్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరికి తమ దేశం తరఫున క్రికెట్ ఆడాలని కలలుకంటారు. అయితే కొంతమంది క్రికెటర్లు తమ స్వదేశంతో పాటు మరొక దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించిన సందర్భాలున్నాయి. అలా రెండు దేశాల క్రికెట్ టీమ్‌లలో ఆడిన వారు ఎవరెవరు అంటే?
వీళ్లు రెండు దేశాల తరఫున క్రికెట్ ఆడేశారు!
By
Published : Sep 20, 2021, 6:36 PM IST
144 ఏళ్ల ప్రపంచ క్రికెట్ ప్రస్థానంలో ఎంతో ఆటగాళ్ల తమతమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా ఒకే క్రికెటర్ రెండు దేశాల తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన సందర్భాలూ కోకొల్లలు. అయితే రెండు దేశాల తరఫున ఇంటర్నేషన్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్ విలియమ్ ఎవన్స్ మిడ్‌వింటర్. ఇంగ్లాండ్‌లో పుట్టిన ఈ క్రికెటర్ 10 ఏళ్లలో 12 మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా జట్టుకూ ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా ఘనత దక్కించుకున్నాడు.
విలియమ్ ఎవన్స్ మిడ్‌వింటర్ తర్వాత ప్రస్తుతం ఇంగ్లాండ్ టీ20 జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐర్లాండ్‌లో పుట్టిన ఈ క్రికెటర్.. తన దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ జట్టు తరఫున దాదాపుగా 23 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టీమ్‌తో చేరిన మోర్గాన్.. 338 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరుకు ఇంగ్లాండ్ జట్టు తరఫున ఇయాన్ మోర్గాన్.. 16 టెస్టులు, 220 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. మోర్గాన్ నాయకత్వంలోనే ఇంగ్లాండ్ జట్టు తొలి వన్డే ప్రపంచకప్ గెలుచుకోవడం విశేషం. అయితే వీరిద్దరితో పాటు మరో 30 మంది కూడా అంతర్జాతీయ క్రికెట్లో రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. వారి వివరాలేమిటో ఒకసారి తెలుసుకుందాం.
రెండు దేశాల తరపున ఆడి రికార్డు సృష్టించిన క్రికెటర్లు..