ఆగస్టు నెలకు సంబంధించి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' (ICC Player of The Month) విజేతలను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC). పురుషుల విభాగంలో ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్‌ను ఈ అవార్డు వరించగా.. మహిళల్లో ఐర్లాండ్‌కు చెందిన ఈమియర్ రిచర్డ్సన్(Eimear Richardson) విజేతగా నిలిచింది.
ICC POTM: 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు విజేతలు వీరే! - ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్
ఆగస్టు నెలకుగానూ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'(Player of Month) అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్(Joe Root News)తో పాటు మహిళల్లో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ ఈమియర్ రిచర్డ్సన్(Eimear Richardson) విజేతలుగా నిలిచారు.
ICC POTM: 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు విజేతలు వీరే
ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్(Joe Root News).. టీమ్ఇండియాతో(India Vs England Test Series) జరిగిన టెస్టు సిరీస్‌లో 105.81 సగటుతో 528 పరుగులు చేశాడు. దీంతో ఆగస్టు నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో విజేతగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను(ICC POTM) ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది ఐసీసీ.
ఇదీ చూడండి..ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' రేసులో బుమ్రా