భారత్, న్యూజిలాండ్(India Vs New Zeland) మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ వచ్చే ఏడాదికి(2022) వాయిదా పడింది. ఇదే విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా కారణంగా ఒకేసారి చాలాజట్లుకు ఆతిథ్యం ఇవ్వలేకపోవడం అందుకు కారణమని తెలుస్తోంది. భారత్‌తో సిరీస్ కంటే ముందుగా ఇతర దేశాల జట్లతో షెడ్యూల్ చేసిన వాటిని పూర్తి చేయడంపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం దృష్టిసారించింది. దీనివల్లే భారత్-న్యూజిలాండ్ పర్యటనలో(India's New Zealand Tour) మార్పు చోటుచేసుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య 3 వన్డేలు జరగాల్సి ఉంది.
IND Vs NZ: భారత్-న్యూజిలాండ్ సిరీస్ వాయిదా - New Zealand Vs Pakistan
కరోనా క్వారంటైన్ నిబంధనలు, వరుస ద్వైపాక్షిక సిరీస్‌ల కారణంగా భారత్-న్యూజిలాండ్ పర్యటన(India's New Zealand Tour) వాయిదా పడింది. ఈ ఏడాది జరగాల్సిన సిరీస్‌ను వచ్చే ఏడాదికి(2022) వాయిదా వేస్తున్నట్లు కివీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
వరుస సిరీస్‌ల కారణంగా న్యూజిలాండ్ ఆటగాళ్లు ఈఏడాది క్రిస్మస్కు స్వదేశానికి చేరుకోలేరు. క్వారంటైన్ నిబంధనల కారణంగా ఈ ఏడాది బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test) జరగకపోవచ్చు. న్యూజిలాండ్ టీమ్ ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో(New Zealand Vs Pakistan) భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇది పూర్తవ్వగానే టీ20 ప్రపంచకప్(ICC T20 Worldcup 2021) ఆడేందుకు కివీస్ బృందం యూఏఈ చేరుకుంటుంది. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్ జట్టు వరుస సిరీస్‌లతో బిజీగా గడపనుంది. తొలుత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో ద్పైపాక్షిక సిరీస్‌లు ఆడనుంది.
ఇదీ చూడండి..Ipl-2021: ఐపీఎల్ రెండోదశలో విజయావకాశాలు ఎవరికి ఎక్కువ?