ఓవల్ వేదికగా సాగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 77/0 పరుగులు చేసింది. ఐదో రోజు మ్యాచ్ గెలవాలంటే రూట్ సేన మరో 291 పరుగులు చేయాల్సి ఉంది.
ప్రస్తుతం క్రీజులో బర్న్స్ (31), హమీద్ (43) ఉన్నారు. భారత్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తున్నా.. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుండటం వల్ల ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టగలుగుతున్నారు.
మొత్తం మ్యాచ్‌లో ఐదో రోజు తొలి సెషన్ అత్యంత కీలకంగా మారనుంది. త్వరగా వికెట్లు తీస్తే, మ్యాచ్ గెలుపుపై భారత అభిమానులు ఆశలు పెట్టుకోవచ్చు. అటు వికెట్లు పోకుండా, నిలకడగా ఆడితే ఇంగ్లాండ్‌కు మ్యాచ్ దక్కే అవకాశమూ లేకపోలేదు.
రోహిత్- పుజారాలకు గాయాలు...
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ, పుజారా మైదానంలోకి దిగలేదు. భారత్ బ్యాటింగ్ సందర్భంగా వీరికి గాయాలైనట్టు, అందుకే మైదానంలోకి అడుగుపెట్టనట్టు తెలుస్తోంది. అయితే వీరి గాయాల తీవ్రత, ఐదో రోజు ఆడతారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.
అంతకుముందు.. భారత్ 466పరుగులకు ఆలౌట్ అయ్యింది. నాలుగో రోజు ఆట భారత్ జడేజా, రహానే, కోహ్లీ వికెట్లను తొలి సెషన్లోనే కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్(50), శార్దుల్(60) జట్టును ఆదుకున్నారు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో జట్టుకు విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన ఉమేశ్, బుమ్రా.. చివర్లో వేగంగా పరుగులు సాధించి జట్టు స్కోరను 450 దాటించారు.
ఇదీ చూడండి:Rohit Sharma: 'నా జీవితంలో అదే అతిపెద్ద నిర్ణయం'