అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ టీ20 ప్రపంచకప్‌లో రాణిస్తే.. కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడి ఉండదని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ అన్నాడు. అప్పుడు కోహ్లీ స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశముంటుందని అతడు పేర్కొన్నాడు.
"ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రాహుల్.. టీ20 ప్రపంచకప్‌లో కూడా టాప్ స్కోరర్‌గా నిలుస్తాడు. భారత బ్యాటింగ్‌కు అతడు వెన్నెముక. రాహుల్ మెరుగ్గా రాణిస్తే.. కోహ్లీపై ఒత్తిడి తగ్గుతుంది. కెప్టెన్‌గా కోహ్లీకిదే చివరి టీ20 ప్రపంచకప్ కాబట్టి.. అతడు తన సహజ శైలిలో స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశముంటుంది. ఇటీవల భారత్ అన్ని ఫార్మాట్లలో ఆధిపత్యం చలాయిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కారణంగా నాణ్యమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుగ్గా రాణిస్తుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం".